ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,945 టెస్టులు చేయగా 3,986 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా మరణాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలపై బులిటెన్ విడుదల చేసింది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,80,237కు చేరింది. అందులో 7,40,229 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 4,591 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు 6,429 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 7,40,229 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 36,474గా ఉందని తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

 

 

Latest Updates