క్రికెట్ లోకి సరికొత్త ఫార్మాట్..

3టీ క్రికెట్‌.. సూపర్ హిట్..

చెలరేగిన మార్క్రమ్‌‌, డివిలియర్స్‌‌
ఏబీకెప్టెన్సీలోని ఈగల్స్‌‌కు గోల్డ్‌ ‌
ఆసక్తికరంగా సాలిడారిటీకప్‌‌

మూడు జట్లు, రెండు భాగాలు, ఒక మ్యాచ్‌‌‌‌ అంటూ క్రికెట్ సౌతాఫ్రికా కొత్తగా ప్రవేశపెట్టిన 3 టీమ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఫార్మాట్ (3టీసీ) ప్రయోగం సక్సెస్‌‌‌‌ అయింది. సాలిడారిటీ కప్‌‌‌‌ పేరుతో నిర్వహించిన ఎగ్జిబిషన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా సాగింది. సౌతాఫ్రికా స్టార్క్రికెటర్లంతా బరిలోకి దిగిన ఈ పోరులో పరుగుల మోతెక్కింది. ఐడెన్‌‌‌‌ మార్క్రమ్‌‌‌‌ (33 బంతుల్లో 70), ఏబీ డివిలియర్స్‌‌‌‌ (24 బంతుల్లో 61) మెరుపు హాఫ్సెంచరీలతో ముందుండి నడిపించడంతో టాప్‌‌‌‌ స్కోరర్గా నిలిచిన ఈగల్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ నెగ్గింది.

సెంచూరియన్‌‌: టెస్టు, వన్డే, టీ20, టీ10.. క్రికెట్‌‌లో మనకు తెలిసిన ఫార్మాట్లు. ఈ లిస్ట్‌‌లో ఇప్పుడు కొత్త ఫార్మాట్‌‌ చేరింది. మిగతా ఫార్మాట్లకు పూర్తి భిన్నంగా ఒక మ్యాచ్‌‌లో మూడు జట్లు తలపడేలా రూపొందించిన 3 టీమ్‌‌ క్రికెట్‌‌ను సౌతాఫ్రికా శనివారం ఇంట్రడ్యూస్‌‌ చేసింది. 36 ఓవర్లలో మూడు జట్లు.. రెండు అర్ధ భాగాల్లో తలపడ్డ సాలిడారిటీ కప్‌‌ ఎగ్జిబిషన్‌‌ మ్యాచ్‌‌ హిట్టయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ మ్యాచ్‌‌లో ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించినప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌‌ ఆడుతున్న సఫారీ సూపర్ స్టార్ఏబీ డివిలియర్స్‌‌ కెప్టెన్సీలోని ఈగల్స్ టీమ్‌‌ విజేతగా నిలిచింది. 12 ఓవర్లలో (రెండు భాగాల్లో కలిపి) ఆ జట్టు అత్యధికంగా 160/4 స్కోరు చేసి గోల్డ్‌‌ గెలిచింది. టెంబా బవూమ నేతృత్వంలోని కైట్స్‌‌12 ఓవర్లలో 138/3 స్కోరుతో సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచి సిల్వర్ సాధించింది. రెజా హెండ్రిక్స్‌‌ నాయకత్వం వహించిన కింగ్‌‌ఫిషర్స్‌‌ 113/5తో థర్డ్‌‌ ప్లేస్‌‌తో బ్రాంజ్‌‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా కారణంగా ఇబ్బంది పడ్డ క్రికెట్‌‌ కమ్యూనిటీకి అందజేస్తారు. రేసిజానికి వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్‌‌ లైవ్స్‌‌ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతుగా ఈ ఈవెంట్‌‌కు సాలిడారిటీ కప్‌‌ అని పేరు పెట్టారు. మ్యాచ్‌‌ ముందు క్రికెటర్లంతా మోకాళ్లపై కూర్చొని తమ సంఘీభావం ప్రకటించారు.

ఆట ఇలా..
36 ఓవర్ల ఈ గేమ్‌‌ మొత్తం ఆరు సెగ్మెంట్స్ (ఇన్నింగ్స్‌‌)గా సాగింది. మూడు జట్లూ రెండు సార్లు 6 ఓవర్ల చొప్పున తలో 12 ఓవర్లు బ్యాటింగ్‌‌ చేశాయి. ఫస్ట్‌‌ ఆరు ఓవర్లు అయిపోయిన తర్వాత ఎక్కువ రన్స్‌‌ చేసిన జట్టు సెకండాఫ్‌‌లో ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసింది. ఆపై, సెకండ్‌‌ హైయెస్ట్‌‌ స్కోరర్, తర్వాత థర్డ్‌‌ టీమ్‌‌ బ్యాటింగ్‌‌కు వచ్చాయి. ప్రతి ఇన్నింగ్స్‌‌లో ఆరుగురు ఫీల్డర్లను అనుమతించారు. గ్రౌండ్‌‌ను ఆరు జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌‌లో ఒక్కో ఫీల్డర్ను ఉంచారు. ఓ బౌలర్కు మ్యాగ్జిమమ్‌‌ మూడు ఓవర్లు కేటాయించారు. ముందుగా తీసిన డ్రా ప్రకారం ఫస్టాఫ్‌‌లో తొలుత కింగ్‌‌ ఫిషర్స్‌‌ బ్యాటింగ్‌‌కు రాగా.. కైట్స్ బౌలింగ్‌‌ చేసింది. ఆరు ఓవర్లలో కింగ్‌‌ ఫిషర్స్‌‌ 2 వికెట్లకు 56 రన్స్‌‌ చేసింది. మలాన్‌‌ (31), హెండ్రిక్స్‌‌ (20) రాణించారు. నోర్జ్‌‌ ఓ వికెట్‌‌ తీశాడు. ఆపై, ఈగల్స్‌‌ బ్యాటింగ్‌‌ చేయగా.. కింగ్ ఫిషర్స్ టీమ్‌‌ బౌలింగ్‌‌ చేసింది. ఆరు ఓవర్లలో ఈగల్స్‌‌ ఒక వికెట్‌‌ నష్టానికి 66 రన్స్‌‌ రాబట్టింది. మార్క్రమ్‌‌ (47 నాటౌట్‌‌), డివిలియర్స్‌‌ (11 నాటౌట్‌‌) అజేయంగా నిలిచాడు. ఆపై, బ్యాటింగ్‌‌కు వచ్చిన కైట్స్‌‌ 6 ఓవర్లలో 58/1 స్కోరు చేసింది. స్మట్స్‌‌ (36 నాటౌట్) రాణించాడు.

సెకండాఫ్‌‌లో ధనాధన్‌‌
మొదటి భాగంతో పోలిస్తే సెకండాఫ్‌‌ ఆసక్తికరంగా సాగింది. ఫస్టాఫ్‌‌లో హైయెస్ట్‌‌ స్కోరు చేసిన ఈగల్స్‌‌ సెకండాఫ్‌‌లో తొలుత బ్యాటింగ్‌‌ చేసింది. కైట్స్ బౌలింగ్‌‌ చేసింది. ఫస్టాఫ్లో నాటౌట్‌‌గా నిలిచిన ఐడెన్‌‌ మార్క్రమ్‌‌, డివిలియర్స్‌‌ చెలరేగడంతో ఈగల్స్‌‌ ఇంకో ఆరు ఓవర్లలో ఏకంగా 94 పరుగులు రాబట్టింది. ఐడెన్‌‌ 27 బాల్స్‌‌లో ఫిఫ్టీ సాధించగా.. డివిలియర్స్‌‌ 21 బాల్స్‌‌లోనే ఈ మార్కు దాటాడు. దాంతో రెండు భాగాల్లో కలిపి ఈగల్స్‌‌ 160 రన్స్‌‌ చేసింది. ఆపై, కైట్స్‌‌ ఇన్నింగ్స్‌‌ కొనసాగించగా.. కింగ్‌‌ ఫిషర్స్‌‌ బౌలింగ్‌‌ చేసింది. ప్రిటోరియస్‌‌ 17 బాల్స్‌‌లో ఫిఫ్టితో చెలరేగినా.. మరో 80 పరుగులే జత చేసి ఓవరాల్‌‌గా 138/3తో నిలిచింది. చివరగా బ్యాటింగ్‌‌కు వచ్చిన కింగ్ఫిషర్స్‌‌ గోల్డ్‌‌ నెగ్గాలంటే ఆరు ఓవర్లలో 105… సిల్వర్ నెగ్గాలంటే 83 రన్స్‌‌ చేయాల్సి వచ్చింది. కానీ, ఈగల్స్‌‌ పదునైన బౌలింగ్‌‌ను తట్టుకోలేక ఆ జట్టు మరో 57 పరుగులే చేసి మూడో ప్లేస్‌‌కు పరిమితమైంది.

For More News..

జెట్టీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ..

మావోయిస్టులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం

చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Latest Updates