మా చివరి కోరిక తీర్చండి.. ఫ్యామిలీ అంతా సూసైడ్!

అమ్మానాన్న.. ఇద్దరు పిల్లలు. సంతోషంగా సాగుతున్న కుటుంబం. కుంగదీసిన ఆర్థిక కష్టాలు.. ఫ్యామిలీ మొత్తాన్ని మింగేసినయ్. కొడుకు, బిడ్డను చంపేసి.. తల్లిదండ్రులిద్దరూ ఎనిమిదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్మ చేసుకున్నారు. తమ చివరి కోరికగా.. కుటుంబం మొత్తాన్ని కలిపి పూడ్చి పెట్టాలని సూసైడ్ నోట్‌లో రాశారు. యూపీలోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది.

చనిపోయేముందు ఫ్రెండ్‌కు వీడియో కాల్..

గుల్షన్ అనే బిజినెస్‌మ్యాన్.. గార్మెంట్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. తన కొడుకు, కూతురు, భార్యతో కలిసి ఘజియాబాద్ ఇంద్రాపురం ఏరియాలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు గుల్షన్ తన మిత్రుడు రమేశ్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే తన కొడుకు, కూతురిని చంపేసిన గుల్షన్ వారి డెడ్ బాడీలను చూపించి, తానూ చనిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. రమేశ్ వెంటనే గుల్షన్ తమ్ముడికి విషయం చెప్పాడు. వాళ్లిద్దరూ అక్కడికి వెళ్లేలోపే ఘోరం జరిగిపోయింది. గుల్షన్, అతడి భార్య, మరో మహిళ అపార్టుమెంట్ ఎనిమిదో ఫ్లోర్ నుంచి దూకేశారు. స్పాట్‌లోనే గుల్షన్, అతడి భార్య మరణించారు. మరో మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

బామమరిదే కారణమని సూసైడ్ నోట్

అపార్టుమెంట్ సెక్యూరిటీ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్లి చెక్ చేయగా.. బెడ్‌పై పిల్లలిద్దరి మృతదేహాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో పెంచుకునే కుందేలును కూడా చంపేశాడు గుల్షన్. బెడ్ రూమ్ గోడకు సూసైడ్ నోట్ అంటించాడు. తమ చావుకు బావమరిది రాకేశ్ వర్మ కారణమని అందులో రాశాడు. అతడు తనకు రూ.2 కోట్ల అప్పు ఉన్నాడని, కానీ అతడిచ్చిన చెక్కులు బౌన్ అయ్యాయని పేర్కొన్నాడు. కొన్నాళ్లుగా తన ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, కుటుంబం తీవ్ర కష్టాల్లో మునిగిపోయిందని సూసైడ్ నోట్‌లో చెప్పాడు.

అంత్యక్రియలకు డబ్బులు కూడా పెట్టి..

సూసైడ్ నోట్‌లో తన చివరి కోరికను రాశాడు గుల్షన్. కుటుంబం మొత్తాన్ని కలిపి పూడ్చిపెట్టాలని కోరాడు. వారి అంత్యక్రియలకు కావాల్సిన డబ్బులు కూడా తీసి పెట్టాడు. దిండు కింద కొంత డబ్బు ఉ:దని, ఆ సొమ్మునే అంత్యక్రియలకు వాడాలని కోరాడు గుల్షన్.

మరో మహిళ ఎవరు?

గుల్షన్ దంపతుల పాటు దూకిన మరో మహిళ ఎవరన్నది కొంతసేపు సస్పెన్స్‌గా మిగిలింది. తొలుత ఆమె గుల్షన్ రెండో భార్య అన్న అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. కానీ, కుటుంబసభ్యులు, ఆపార్టుమెంట్‌లోని వాళ్లు కాదని చెప్పారు. ఫ్యాక్టరీలో విచారణ తర్వాత అసలు విషయం తెలిసింది. గుల్షన్ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఆమె మేనేజర్ అని, ఆమె పేరు సంజన అని తేలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అయితే గుల్షన్ కుటుంబంతో కలిసి ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్న దానిపై పోలీసులకు మిస్టరీగా మారింది.

MORE NEWS:

హోటల్‌లో క్రిస్మస్ ట్రీ.. 107 కోట్ల వజ్రాలతో డెకరేషన్

నాసా కంటే ముందే.. చంద్రయాన్ ల్యాండర్ కనిపెట్టింది మనోడే!

Latest Updates