వైరల్ వీడియో: భంగ్రా స్టెప్స్‌‌తో అదరగొట్టిన ఫారెనర్స్

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహిందీ గురించి వినే ఉంటారు. తెలుగులో కూడా పలు పాటలు పాడిన దలేర్ ముఖ్యంగా కాలా కవ్వా, తునక్ తునక్ తున్ లాంటి సాంగ్స్‌‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించారు. పంజాబీ భాంగ్రా స్టెప్పులతో సాగే తునక్ తునక్ సాంగ్ ఇప్పటికీ పలు ఫంక్షన్లలో, పార్టీల్లో వినబడుతుంటుంది. తాజాగా ఈ సాంగ్‌‌పై ఫారెనర్స్ వేసిన డిఫరెంట్ భాంగ్రా స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. తునక్ తునక్ ట్రాక్‌‌కు పర్ఫెక్ట్ సింక్‌‌తో నలుగురు చేసిన డ్యాన్స్ నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. బ్రిలియంట్ గాయ్స్, కుమ్మేశారుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి.

Latest Updates