4 కోట్లు ఆశ చూపి.. 29 లక్షలు కొట్టేశారు

ఛారిటీ ట్రస్ట్ ఫారిన్ ఫండింగ్ పేరుతో మోసాలు 

సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌ ను పట్టుకున్నరాచకొండ పోలీసులు
ఇద్దరు అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితురాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చారిటీ ట్రస్ట్‌‌‌‌ ఫారిన్‌‌‌‌ ఫండింగ్‌‌‌‌ పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లను రాచకొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి పీవోఎస్‌‌‌‌ మెషీన్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, రూ. 74 వేల విలువైన స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలి కోసం గాలిస్తున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ సోమవారం వెల్లడించారు.

ఫారిన్ ఫండింగ్‌‌‌‌ పేరుతో ట్రాప్

ఇండియాలో ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్ట్‌‌‌‌ చేసేందుకు ఫారినర్స్‌‌‌‌ డొనేషన్స్‌‌‌‌ ఇస్తున్నారని సోషల్‌‌‌‌ మీడియాలో ఈ గ్యాంగ్‌‌‌‌ ప్రచారం చేసింది. తమ ట్రాప్‌‌‌‌లో చిక్కిన వారి అకౌంట్స్‌‌‌‌లో ఫారిన్‌‌‌‌ ఫండ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ చేస్తామని నమ్మించింది. ఇందులో భాగంగా అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో సఫిల్‌‌‌‌గూడకు చెందిన ప్రకాశ్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసింది. నైజీరియన్‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌ వాట్సాప్‌‌‌‌ చాటింగ్, కాల్స్‌‌‌‌తో బాధితుని ట్రాప్ చేశాడు.  రూ.4 కోట్ల విలువైన యూఎస్‌‌‌‌ డాలర్స్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ చేస్తామన్నాడు. తరువాత ఫారిన్‌‌‌‌ రెమిటెన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి కాల్‌‌‌‌ చేస్తున్నట్లు సోనియా శర్మకాల్‌‌‌‌ చేసింది.యూఎస్‌‌‌‌ డాలర్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ కోసం కస్టమ్స్‌‌‌‌, ఆర్బీఐ, సర్వీస్‌‌‌‌ చార్జీల పేరుతో రూ. 29.75 లక్షలు వసూలు చేసింది. ఈ గ్యాంగ్‌‌‌‌ను బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ ఆధారంగా రాచకొండ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ టీమ్స్‌‌‌‌ ట్రేస్‌‌‌‌ చేశాయి. నైజీరియన్‌‌‌‌తో పాటు సోనియా గ్యాంగ్‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న సోనియా శర్మ కోసం గాలిస్తోంది.

ఢిల్లీ అడ్డాగా సైబర్ చీటింగ్‌‌‌‌

ఢిల్లీకి చెందిన సోనియా శర్మ.. తిలక్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో సోనియా కమ్యునికేషన్స్‌‌‌‌ పేరుతో వెస్ట్రన్‌‌‌‌ యూనియన్ మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్స్ వ్యాపారం చేస్తోంది. ఢిల్లీలోని  హైనిక్‌‌‌‌ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌కు చెందిన అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌ ‌‌‌‌(28)తో కలిసి ఫారిన్‌‌‌‌ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చుతోంది. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన చిబుయిక్‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌ (32)తో పరిచయం ఏర్పడింది. ఆ నైజీరియన్‌‌‌‌తో కలిసి గ్యాంగ్‌‌‌‌ ఫామ్ చేసి సోషల్‌‌‌‌ మీడియా ఫ్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలకు స్కెచ్‌‌‌‌ వేసింది. వాట్సాప్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ఈ–మెయిల్స్ అడ్డాగా చారిటీ ఫండ్స్‌‌‌‌ పేరుతో చీటింగ్‌‌‌‌ స్టార్ట్ చేసింది.

Latest Updates