ఎస్కార్ట్ వెహికల్ పై ట్రక్కు బోల్తా.. నలుగురు మృతి

గయ: లాక్​డౌన్ సడలింపుల తర్వాత రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. బీహార్ లోని గయ జిల్లాలో ఎస్కార్ట్ వెహికల్ పై ట్రక్కు బోల్తా పడటంతో ఇద్దరు హోంగార్డులతో సహా నలుగురు చనిపోయారు. గురువారం రాత్రి గయ జిల్లా పంచన్ పూర్ పీఎస్ పరిధిలోని దరియాపూర్ గ్రామానికి దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న గనుల శాఖ ఎస్కార్ట్ వెహికల్ పై ట్రక్కు బోల్తా పడిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా శుక్రవారం మీడియాకు తెలిపారు. ప్రత్యేక సహాయక పోలీసు సిబ్బందిగా ఉన్న వినోద్ శర్మ (55), చందన్ కుమార్ (20) ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారని, ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (హోంగార్డ్) పంకజ్ కుమార్ మాట్లాడుతూ ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు రూ .4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Latest Updates