ధవళేశ్వరం బ్యారేజ్‌ నుండి 4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

వర్షాలకు పరవళ్లు తొక్కుతుతున్న గోదావరి..

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.40 అడుగులు

రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు స్థానికంగా మంచి వర్సాలు పడుతున్నాయి. దీంతో గోదావరి నదిలో వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 9.40 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేశారు.  నాలుగు లక్షల  క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షా కాలం ప్రారంభమైన తర్వాత ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు 10 వేల 500 క్యూసెక్కుల సాగు నీరు విడుదల ప్రారంభించారు.

Latest Updates