దూబే ఎన్‌కౌంటర్‌‌పై దర్యాప్తు చేయాలంటూ.. నాలుగు పిటిషన్లు

  • ఇన్వెస్టిగేషన్‌ చేయాలంటూ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌‌పై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వికాస్‌ దూబే, అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌‌కు సంబంధించి సీబీఐ/ఎన్‌ఐఏ విచారణ జరపాలని అడ్వకేట్‌ అనూప్‌ అవస్థీ పిటిషన్‌ వేశారు. ముంబైకి చెందిన లాయర్‌‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ, ఎన్‌జీవో, పీయూసీఎల్‌ కూడా పిటిషన్‌ వేశారు. సిట్‌ విచారణ జరిపించాలని దాంట్లో కోరారు. పోలీసులు ఫేక్‌ ఎన్‌కౌంటర్‌‌ చేశారని వారిపై విచారణ జరపాలని కోరుతూ అటల్‌ బిహారీ దూబే కూడా పిటిషన్‌ వేశారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బిక్రూ గ్రామానికి చెందిన వికాస్‌ దూబే 60 కేసుల్లో నిందితుడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా వాళ్లపై కాల్పులు జరిపడంతో 8 మంది పోలీసులు చనిపోయారు. ఈ కేసులో పరారీలో ఉన్న దూబేను ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉత్తర్‌‌ప్రదేశ్‌కు తరలిస్తుండగా ఎన్‌కౌంటర్‌‌ చేసిన విషయం తెలిసిందే.

Latest Updates