పాకిస్తాన్ లోని కరాచీ స్టాక్  ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి

పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ (సోమవారం) ఉదయం తుపాకి, గ్రనేడ్లతో వచ్చిన ఓ వ్యక్తి స్టాక్ ఎక్స్ఛేజ్ బిల్డింగ్ లోకి ప్రవేశించి… దాడికి దిగాడు. అతనితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా దాడికి పాల్పడ్డారు. వెంటనే అలర్టైన పోలీసు అధికారులు ఎదురు కాల్పులు జరిపి ఆ నలుగురినీ హతమార్చారు. ఈ బిల్డింగ్  హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉందని, చాలా బ్యాంకుల ప్రధాన శాఖలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు పోలీసులు.

సిల్వర్ కలర్ లో ఉన్న కరోలా కారులో వచ్చిన నలుగురు టెర్రరిస్టులు…పార్గింగ్ ఏరియా నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్ లోకి ప్రవేశించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మొదట బిల్డింగ్ మెయిన్ గేట్ దగ్గర గ్రనేడ్లు విసిరాని… ఆ తర్వాత లొపలికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఘటన స్థలానికుని జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు కరాచీ పోలీస్ చీఫ్ గులాం నబీ మీనన్.

Latest Updates