40 రోజులుగా వేలాడుతూనే ఉన్నాయి : అదృశ్యం అయిన ప్రేమజంట ఆత్మహత్య

lovers-deathఆ ప్రేమ జంట అదృశ్యం అయ్యింది.. రెండు నెలల క్రితమే కనిపించకుండాపోయారు. ఫోన్ లేదు.. ఎలాంటి సమాచారం లేదు.. కనీసం ఫ్రెండ్స్ కూడా టచ్ లో లేకుండాపోయారు. భయంతో.. ఎక్కడో ఓ చోట బతుకుతూ ఉండి ఉంటారు.. క్షేమంగా ఉంటే చాలు అనుకున్నారు రెండు కుటుంబాల్లోని సభ్యులు. కానీ అది వాస్తవం కాదు.. ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు.. 40 రోజుల క్రితం చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండ నరసింహస్వామి గుట్టపై యువతీ, యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు. ఘటన జరిగి 40 రోజులకు పైనే అవుతుందని అనుమానిస్తున్నారు పోలీసులు. వీరిది నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హస్తకుతూర్ కు చెందిన పెద్దింటి ప్రశాంత్, గాండ్ల గౌతమిగా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో మొబైల్, సిమ్ కార్డు దొరకడంతో ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు. రెండు నెలల క్రితం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో వీరు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదైంది.

Posted in Uncategorized

Latest Updates