సికింద్రాబాద్‌లో 40 కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌ ఏరియా లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్యారడైజ్‌, రాణీగంజ్‌, మోండా మార్కెట్‌ ఏరియాల్లో బుధవారం 40 కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ, పోలీస్​ అధికారులు కంటెయిన్‌మెంట్‌ చర్యలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే సూర్య టవర్స్‌, పారడైజ్‌, సిటీ లైట్స్‌ హోటల్‌, మినర్వా కాంప్లెక్స్​ను మూసేశారు. సిటీ లైట్స్‌ సమీపంలోనే 14 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. మహవీర్‌ టెక్స్​టైల్‌, పాన్‌ బజార్‌ ఏరియాల్లో రాకపోకలు నిలిపేశారు.

గాజులరామారం డీసీకి..

జీహెచ్‌ఎంసీ సిబ్బందిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటికే 40 మందికి పైగా వైరస్​బారిన పడ్డారు. బుధవారం గాజులరామారం సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌కు, జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​లో ఐటీ ఉద్యోగికి పాజిటివ్​వచ్చింది. అధికారులు ఐటీ విభాగాన్ని క్లోజ్​చేసి ఉద్యోగులను ఇంటికి పంపించారు.

హోం మంత్రి ఎస్కార్ట్స్​లో ఐదుగురికి..

హోంమంత్రి మహమూద్‌ అలీ సెక్యూరిటీ సిబ్బందిలో బుధవారం ఐదుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ముందుగా ఓ అధికారికి వైరస్​ సోకడంతో మూడ్రోజులుగా50 మంది సిబ్బందికి టెస్టులు చేశారు. మరో 15 మంది రిజల్ట్స్‌ గురువారం రానున్నాయి.

పరిగిలో ఒకరికి..
వికారాబాద్ జిల్లా పరిగి గంజ్​ రోడ్డులోని బట్టల వ్యాపారికి జ్వరం రావడంతో సిటీలో టెస్ట్​ చేయించగా పాజిటివ్​గా తేలింది.

Latest Updates