పక్షి కోసం 40 రోజులు

ఎవరెలా పోతే మనకేంటి, మనం బాగుంటే చాలు…అనుకునే రోజులివి. అలాంటిది తన స్వార్థా న్ని పక్కనపెట్టి పక్షి కోసం తమిళనాడుకి చెందిన ఒక యువకుడు చేసిన ఆలోచన ఎందరినో కదిలించింది. పక్షి కోసం ఇతను పడుతున్న ఆరాటం చూసి నలభై రోజులపాటు ఒక వీధంతా చీకట్లో ఉంది. దాదాపు వంద కుటుంబాలు వీధి లైట్లన్నీ ఆపేసి ఆ పక్షికి ఓ గూడు కల్పించడానికి ఇతనితో చెయ్యి కలిపాయి. ఇంతకీ ఎవరా యువకుడు.. అసలు పక్షికి వీధి లైట్లకి సంబంధమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

పక్షికోసం 40 రోజుల పాటు వీధి లైట్లు ఆపించిన ఇతని పేరు కరుప్పు రాజా. తమిళనాడులోని పొత్తాకుడి సొంతూరు. రాజా వాళ్ల ఇల్లు వీధి చివరన ఉండటంతో వీధంతటికీ సంబంధించిన స్ట్రీట్ లైట్ స్విచ్ బోర్డ్ తన ఇంటి ముందే ఉండేది. దాంతో రోజూ సాయంత్రం ఆరింటికి వీధిలైట్లు వేసి ఉదయం ఐదిం టికి ఆఫ్ చేస్తుండేవాడు రాజా. గత పదేళ్లుగా స్ట్రీట్ లైట్స్ బాధ్యతని అతనే తీసుకుంటున్నాడు. కానీ, అనుకోకుండా రాజా కంటపడ్డ ఓ పక్షి అతడ్ని ఆలోచింపజేసింది.

ఒప్పిం చాడు

గూగుల్ అంతా జల్లెడ పట్టి ఆ పక్షి పేరు, వివరాలు సేకరించాడు. దాని పిల్లలు ప్రపంచాన్ని చూడటానికి కనీసం 40 రోజులు పడుతుందని తెలుసు కున్నాడు. దాంతో ఆ పక్షి గూడుని, గుడ్లని ఫొటోలు తీసి ఊరి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ‘అనుకోని అతిధి మన వీధికొచ్చింది.. దానికి ఎలాంటి కష్టం లేకుం డా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంద’నే ఓ క్యాప్షన్ కూడా యాడ్ చేశాడు. పోస్ట్ చేసిన మరుక్షణం నుం చే ఊరివాళ్లంతా ఒక్కొక్కరి గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పక్షికోసం ఇదంతా ఎందుకనే వాదనలు కూడా వినిపించాయి. కానీ, వద్దని వారించిన ప్రతి ఒక్కరి దగ్గరికీ పర్సనల్ గా వెళ్లి ఒప్పించాడు రాజా. ఎవరైనా పొరపాటున మర్చి పోయి లైట్స్ వేస్తే అన్న ఆలోచనతో పంచాయతీ ఆఫీస్ కి వెళ్లి పవర్ కట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. వాళ్లు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయి అంగీకరించారు.

అతిధులు వచ్చారు

అంతేకాదు పంచాయతీ వాళ్లు ఇంటిం టికి వెళ్లి పవర్ కట్ విషయం చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. రాత్రి సమయంలో టార్చ్​ సాయం లేకుండా బయటకు రావద్దని రిక్వెస్ట్ చేశారు. నలభైరోజుల పాటు వీధిలైట్లకి పవర్ సప్లై కట్ చేశారు. రాజా కూడా ఆ నలభై రోజులు పక్షి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుం డా జాగ్రత్తలు తీసుకున్నాడు. పక్షికి ఎప్పటికప్పుడు నీళ్లు, గింజలు ఇస్తూ దానికి ఏ లోటు లేకుం డా చూసుకున్నాడు. ఆ పక్షి గూట్లో పిల్లల కిచకిచలు వినిపించాకే వీధిలో లైట్లు వేశాడు రాజా.

ఆలోచన వచ్చింది

ఒక రోజు మధ్యాహ్నం ఫోన్​ మాట్లాడుకుంటూ ఇంటిముందు నిల్చున్నాడు రాజా. సరిగ్గా టైంలోని నీలిరంగు లో ఉన్న ఒక పక్షి వీధిలైట్ల స్విచ్ బోర్డ్ దగ్గర తిరుగుతూ కనిపిం చింది. ఒక గంటసేపు దూరం నుంచి ఆ పక్షి ఏ చేస్తుందో గమనించాడు. కానీ, ఏం అర్థం కాకపోవడంతో దగ్గరికి వెళ్లి చూస్తే పొడవాటి పుల్లలు, స్ట్రాలతో స్విచ్ బోర్డ్ దగ్గర గూడు కడుతూ కనిపిం చిందా పక్షి. దాంతో దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంటికొచ్చేశాడు రాజా. రోజూలాగే ఆ రోజు సాయంత్రం కూడా వీధిలైట్లు వేయడానికి వెళ్లాడు. కానీ, రాజాని చూసి ఆ పక్షి పుల్లలన్నీ కిందపడేసి భయంతో అక్కడ్నుంచి పారిపోయింది. వరుసగా మూడునాలుగు రోజులు ఇలానే జరిగింది. కానీ, వీధిలైట్లు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో పక్షి గురించి బాధనిపించి నా లైట్లు వేయడం ఆపలేదు అతను. కానీ, ఒక వారం తర్వాత ఆ స్విచ్ బోర్డ్ వెనక భాగంలో పక్షి గుడ్లు కనిపించాయి. వాటిని కపాడుకోవడానికి కోసం పక్షి పడుతున్న ఆరాటం చూసి దానికి తనవంతు సాయం చేయాలనుకున్నాడు రాజా.

Latest Updates