యెమెన్ ఘర్షణల్లో 40 మంది మృతి

  •  260 మందికి గాయాలు 
  •  ఏడెన్  సిటీలో ఘటన

దుబాయి: యెమెన్ లో ప్రభుత్వ బలగాలు, వేర్పాటువాదుల మధ్య జరిగిన ఘర్షణలో 40 మంది చనిపోగా, 260 మంది గాయపడ్డారు. యెమెన్ లోని రెండో పెద్ద సిటీ ఏడెన్ లో  బుధవారం నుంచి  పోరు నడుస్తు్న్నట్లు యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. బక్రీద్ పండుగ సమయంలో తమవారిని కోల్పోయిన బంధువులు బాధలో మునిగిపోయారని యూఎన్ హ్యూమనిటేరియన్ కోఆర్డినేటర్ లైస్ గ్రాండే అన్నారు. గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు మెడికల్ టీమ్ లను పంపిస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల క్రితం రాజధాని సనా నుంచి యెమెన్ ప్రెసిడెంట్ అబెద్రబో మన్సౌర్ హాదిని రెబల్స్ తరిమేసినప్పటి నుంచి పోర్ట్ సిటీ ఏడెన్ తాత్కాలిక రాజధానిగా కొనసాగుతోంది.

 

Latest Updates