40% ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిల్ కావట్లే

న్యూఢిల్లీ: ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్… ఒకప్పుడు అవసరం కోసం వాడటం మొదలుపెట్టాం. ఇప్పుడు ప్లాస్టిక్​ను వాడటమే పెద్ద అవసరమైపోయింది. ఏ వస్తువును కొనాలన్నా.. దానితో ప్లాస్టిక్​ఏదో విధంగా ముడిపడి ఉంటోంది. కూరగాయలు, ఆహారం, వస్తువులు.. ఇలా ఏదైనా ప్లాస్టిక్ లేనిదే పని జరగదు. అంతలా మారిపోయింది పరిస్థితి. ఇలా దేశంలో రోజుకు 25 వేల టన్నులకుపైగా ప్లాస్టిక్ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. కానీ ఇందులో రీసైకిల్ అవుతున్నది 60 శాతమే. మిగతా 40 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు అలానే పర్యావరణంలో కలిసిపోతున్నాయి. ఇదేదో స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో వెల్లడించిన నిజాలు.

‘ఆల్టర్నేటివ్’ చాలా కష్టం

ప్లాస్టిక్​కు బదులుగా గ్రీన్ ఆల్టర్నేటివ్స్​ను అభివృద్ధి చేయడంపై మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవదేకర్ బదులిచ్చారు. ప్లాస్టిక్ ధర చాలా తక్కువ అని, దీంతో దానికి ఆల్టర్నేటివ్​గా మరో దాన్ని కనుక్కోవడం అతిపెద్ద ‘చాలెంజింగ్ టాస్క్’ అని చెప్పారు. అయితే మరిం త ఎక్కువగా, ఎఫెక్టివ్​గా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్​మెంట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఆ సిటీల్లో రోజుకు 4,059 టన్నులు

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) దేశంలో 60 ప్రధాన సిటీల్లో జరిపిన సర్వే వివరాలను జవదేకర్ వివరించారు. ఆ సిటీల్లో రోజుకు 4,059 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతోందని తెలిపారు. ‘‘దాదాపుగా 25,940 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ దేశవ్యాప్తంగా రోజూ ఉత్పత్తి అవుతోంది. 4,773 వరకు రిజిస్టరైన ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్/మల్టీ లేయర్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్/రీసైక్లింగ్ యూనిట్లు దేశంలో ఉన్నాయి. సుమారుగా రోజుకు 15,384 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్​ను సేకరించి, రీసైకిల్ చేస్తున్నారు. అంటే మొత్తం ప్లాస్టిక్ వేస్ట్​లో 60 శాతం రీసైకిల్ చేస్తున్నారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్​లో పలు ప్రొడక్టులు తయారు చేస్తున్నారు. ఇక రోజూ 10,556 టన్నుల ప్లాస్టిక్​ వేస్ట్ మాత్రం కలెక్ట్ చేయడం లేదు.
మొత్తం ప్లాస్టిక్ వేస్ట్​లో ఇది 40 శాతం. ఇదంతా మొత్తం ఎన్విరాన్​మెంట్​లో కలిసిపోతోంది” అని చెప్పారు. ప్లాస్టిక్ విషయంలో కంపోస్టబుల్, బయోడీగ్రేడబుల్ టెక్నాలజీపై రీసెర్చ్, డెవలప్​మెంట్ కోసం సెంట్రల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ (సీఐపీఈటీ) ఓ ఎక్స్​పర్ట్ గ్రూప్​ను నియమించిందని చెప్పారు.

A man makes a heap of plastic bottles at a junkyard in Chandigarh, June 5, 2018. REUTERS/Ajay Verma/File Photo

Latest Updates