ట్రీట్మెంట్ పేరుతో యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు

మన ప్రాణాలు కాపాడే డాక్టర్లు అంటే మనలో చాలామందికి గౌరవభావం ఉంటుంది. కానీ… అలాంటి డాక్టర్లే ట్రీట్మెంట్ పేరుతో రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడడం విస్మయానికి గురిచేస్తుంది.

ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపిన వివరాల ఆధారంగా నార్త్ ముంబై త్రివేణి నగర్ కు చెందిన యువతికి కి పదే పదే కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి మలాద్  ప్రాంతానికి చెందిన ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు తీసుకొచ్చింది. తన ఓపీ రావడంతో యువతి  డాక్టర్ తో చెక్ చేయించుకునేందుకు గదిలోకి వెళ్లింది. గదిలోకి వెళ్లిన యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉదర భాగాన్ని పరీక్షించాలంటూ పలుమార్లు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు బాధితురాలితో దుస్తులు తొలగిస్తే ట్రీట్మెంట్ చేస్తానని చెప్పాడు.  డాక్టర్ వాలకంతో అప్రమత్తమైన యువతి ఆస్పత్రి ఎమర్జెన్సీ బెల్ నొక్కడంతో బాధితురాలి తల్లి , ఆస్పత్రి స్టాఫ్ తరలివచ్చారు.

డాక్టర్ వాలకంపై యువతి, బాధితురాలి తల్లి కురార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో డాక్టర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates