వైరల్ వీడియో : ఆంటీ అన్నందుకు యువతిని చితక్కొట్టిన మహిళ

ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న తరువాత ఆంటీ అని పిలవాలన్న, పిలిచేందుకు ట్రై చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

ఉత్తర్ ప్రదేశ్ లో బాబు గంజ్ మార్కెట్ ఇత్హా అనే మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ లో  కార్వా చౌత్ అనే హిందూ సాంప్రదాయంలోని పండుగకు సంబంధించిన పూజా సామాగ్రినికి కొనుగోలు చేసేందుకు 40ఏళ్ల మహిళ, తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. అదే సమయంలో ఓ 19ఏళ్ల యువతి దారికి అడ్డంగా ఉన్న సదరు మహిళను ఆంటీ కొంచెం దారివ్వండి అంటూ రిక్వెస్ట్ చేసింది. అంతే నువ్వు నన్ను ఆంటీ అంటావా అంటూ దాడి చేసింది. ఆంటీకి సపోర్ట్ గా ఆమె కుటుంబసభ్యులు కలిసి సదరు యువతి జుట్లు పట్టుకొని కొట్టేదాకా వచ్చింది. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిపై చేయిచేసుకుంటున్న ఆంటీని , ఆమె కుటుంబ సభ్యుల్ని సముదాయించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Updates