క్వారంటైన్‌‌లో ఉన్న మహిళపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్

క్వారంటైన్‌ లో ఉన్న ఓ మహిళను ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి రాజస్థాన్‌లో జరుగగా లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  లాక్ డౌన్ కారణంగా ఓ మహిళ రాజస్థాన్‌లోని సవాయి మాదోపూర్ జిల్లాలో ఉండిపోయింది. నెల రోజులు కావస్తున్నా లాక్ డౌన్ సడలకపోవడంతో చేసేదేమి లేక ఆమె తన సొంత ఊరైన జైపూర్‌కు నడుచుకుంటూ బయలుదేరింది. రాత్రి కావడంతో బటోడా పోలీస్ స్టేషన్ పరిదిలోని  స్కూల్‌లోని  క్వారెంటేన్ ఆమె ఉంది.  ఇదే అదునుగా భావించిన ఓ ముగ్గురు వ్యక్తులు ఆమెను అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు.

ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు డీఎస్పీ పార్త శర్మ. సదరు మహిళను వైద్య పరీక్షలు నిర్వహించామని, స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు. ఆ మహిళ కొడుకు దౌసా జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒంటరిగా జైపూర్‌లో నివసిస్తున్నట్లు చెప్పారు.

Latest Updates