మానేరు నది ఒడ్డున 100 ఎకరాల్లో 400 కాటేజ్ లు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రానికి మహర్దశ పట్టనుంది. సిరిసిల్ల పట్టణ శివారులో మానేరు నది ఒడ్డున వందెకరాల ప్రభుత్వ స్థలంలో 400 కాటేజ్ లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. మధ్యమానేరు బ్యాక్ వాటర్ లో బోటింగ్​ సదుపాయం, ఆ పక్కనే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, మానేరు కరకట్ట పక్కనుంచి బతుకమ్మ తెప్ప వరకు వందఫీట్ల వెడల్పుతో ఫోర్ లే న్ రోడ్డు, హైమాస్ట్​లైట్లు , మధ్యమధ్యలో చెక్ డ్యాంలు, అందులో మినీ బోటింగ్ లు,పార్క్​లు ఏర్పాటు చేసేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెం కట్రామ్ రెడ్ డి భారీ బడ్జెట్ తో ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రావ్ శనివారం సిరిసిల్లను సందర్శించి మానేరు తీరాన్ని పరిశీలించా రు. ప్రభుత్వ స్థలాలు చూసి అతిథి గృహాల నిర్మా ణాలకు అనువుగా ఉందనిపేర్కొన్ నారు. వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రతిభక్తుడు ఈ పర్యటక కేం ద్రాన్ని సందర్శించే విధంగా,అవసరమైతే ఇక్కడే అతిథి గృహాల్లో బస చేసేలా 400గెస్ట్​ హౌస్ లు నిర్మించాలని భావిస్తున్నారు. మానేరుతీరం అభివృద్ధిపై చర్చించారు. టూరిజం ఎండీమనోహర్ రావ్ తో చేసిన అధ్యయనాన్ని ప్రభుత్వానికి పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు

 

Latest Updates