సీసీఎస్ కు రూ.400 కోట్లు అప్పుపడ్డ ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికులు తమభవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకు నేందుకు ఏర్పాటు చేసుకున్న క్రెడిట్ అండ్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) వ్యవహారంలో ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపైయూనియన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సి న సొమ్ము ను ఆర్టీసీ యాజమాన్యం తన అవసరాలకు వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయలను సీసీఎస్ నుంచి ఆర్టీసీ వాడుకుంది. దీనిపై కార్మిక నేతలు ఆందోళనలు చేపట్టారు. సీసీఎస్ నుంచి కార్మికుల సొమ్ము తీసుకొని వారికే జీతాల రూపంలో ఆర్టీసీ ఇస్తోంది. సీసీఎస్ నుం చి తీసుకుంటున్న రుణాలకు వడ్డీ కట్టటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ఇతర బ్యాంకు లవద్ద అప్పులు తీసుకునే బదులు సీసీఎస్ నుంచి రుణాలు తీసుకోవటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ క్రమంలోనే దాదాపు 4 వందలకోట్ల రూపాయల వరకు సీసీఎస్ కు అప్పుపడింది.

కార్మికులకు రుణాలు ఇచ్చేందుకు ఏర్పాటైన సంస్థ సీసీఎస్

ఆర్థిక అవసరాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 1952 లో సీసీఎస్ ను ఏర్పాటు చేశారు. కార్మికులు నెల నెలా సీసీఎస్ లో కొంత మొత్తాన్ని జమ చేస్తుంటా రు. వారి వేతనాలనుం చి కొంతమొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యమే సీసీఎస్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ విధంగాదాదాపు 1500 కోట్ల రూపాయల వరకు సీసీఎస్ ఖాతాలో జమయ్యాయి. ఈ డబ్బును ఆర్టీసీ కార్మికులకు రుణాల రూపంలో ఇస్తారు. రిటైర్అయిన కార్మికులకు వారి సర్వీసులో జమ చేసిన మొత్తానికి పదిశాతం వడ్డీతో కలిపి ఇస్తారు. కానీ ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకే సీసీఎస్ నుంచి డబ్బును మళ్లిస్తున్నారు. దీనికి వడ్డీ చెల్లించటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.నిజానికి సీసీఎస్ అనేది స్వతంత్రంగా వ్యవహారించాల్సి న సంస్థ. దీన్ని కొంతమంది ఆర్టీసీ జేబు సంస్థగా మార్చి ఇష్టానుసారంగా నిధులను మళ్లిస్తున్నారు. దీంతో సొసైటీ కార్మికులకు రుణాలరూపంలో ఇస్తే వచ్చే వడ్డీ ఆదాయం సీసీఎస్ కురాకుండా పోతోంది.

లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు7500 మంది

సీసీఎస్ నుంచి లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 7500 కు చేరింది. సాధారణంగా సీసీఎస్ నుం చి తీసుకు న్న రుణాలకు తక్కు వవడ్డీ ఉంటుం ది. పైగా ఆర్టీసీ కార్మికుల అవసరాలకు అనుగుణంగా లోన్లు ఇస్తారు. ఈఉద్దేశంతో చాలా మంది లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్ననప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది. సీసీఎస్ కు ఉన్న ఆదాయంలో దాదాపు 400కోట్ల రూపాయలు ఆర్టీసీ వద్దే ఉండటంతో లోన్లుఇవ్వటం కుదరటం లేదు. దీం తో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగైతే సీసీఎస్ మనుగడ కష్టమే

ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్ సభ్యత్వంతో పేరుతో కార్మికుల నుంచి రికవరీ చేసినసొమ్ము ను వాడుకోవటం విడ్డూరంగా ఉందనిఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆవేదనవ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం వైఖరికి నిరసనగా శనివారం మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శిరాజిరెడ్డి మాట్లాడుతూ వెంటనే కార్మికు ల నుం చిరికవరీ చేసిన సొమ్ము ను సీసీఎస్ కు చెల్లించాలని డిమాం డ్ చేశారు. ఈ నెల 15 వ తేదీ నాటికేసీసీఎస్ కు అప్పు పడ్డ బకాయిని చెల్లిస్తామనిచెప్పిన ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు మాటనిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ విషయంలోసీసీఎస్ పాలక మండలి అయిన టీఎంయూతీవ్ర నిరక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆయనవిమర్శిం చారు. బకాయిలు చెల్లించకపోతున్నఆర్టీసీ యాజమాన్యం నెల నెలా సీసీఎస్ రికవరీని నిలిపేయాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పాల్గొన్నారు.

Latest Updates