ఆ ఊరంతా ఆలయాలే..

నిత్యం పూజలు, ధూపదీప నైవేద్యాలు, వేద పండితుల వేదఘోషలు, భక్తుల రాకపోకలు.. ఇదంతా ఒకప్పటి వైభవం. మరిప్పుడు.. కూలిపోతున్న గోడలు, కదులుతున్న పునాది రాళ్లు , ఒరుగుతున్న స్తంభాలు, నేలమట్టం అయిన ఆలయాలు.

ఆ ఊరి పేరు నగునూర్. కరీంనగర్‌‌ జిల్లా లో ఉంది. దీన్ని కాకతీయుల కాలంలో ‘నన్నూరు’ అని పిలిచేవాళ్లు. నన్నూరు అంటే నాలుగు వందలు అని అర్థం. అప్పట్లో ఈ ఊళ్లో నాలుగు వందల ఆలయాలు ఉండేవి. అందుకే అలా పిలిచేవాళ్లు. అవన్నీ కాకతీయుల పాలనలో ఎంతో వైభవంగా విలసిల్లేవి. ఊళ్లో ఎక్కడ తవ్వినా.. శివలింగాలు, నంది విగ్రహాలు బయటపడతాయి. ఎందుకంటే అక్కడ సుమారు 390 శైవ ఆలయాలు భూగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు బయటపడేవి వాటిలోని విగ్రహాలే. ఈ ప్రాంతం చాళుక్యులు, కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం చాళుక్యుల కాలంనాటి మూడు ఆలయాలు, శిథిలావస్థలో ఉన్న మరో ఎనిమిది ఆలయాలు, ఎన్నో శాసనాలు ఉన్నా యి. 8వ శతాబ్దం నుంచి 13వ
శతాబ్దం వరకు వేములవాడ చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయులు పాలించారు. చాళుక్యులు కట్టించిన త్రికూటాలయం వాళ్ల ఘనతకు నిదర్శనం. ఇక్కడి ఆలయాల్లో మూడు శివలిం గాలు ఉంటాయి. అడుగుకో నంది విగ్రహం కనిపిస్తుంది. చెక్కు చెదరని ఎత్తైన రాతి స్తంభాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే.. శివాలయానికి ఉన్న రాతి ద్వారం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. -కరీంనగర్, వెలుగు

Latest Updates