ఏపీలో కొత్తగా 4,038 కేసులు..38 మంది మృతి

అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,038 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో ఏపీలో 7,71,503కు కరోనా కేసులు చేరాయని.. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కరోనాతో 38 మంది మృతి చెందారని చెప్పింది. ఇప్పటివరకు కరోనాతో 6,357 మంది మృతి చెందారంది. ప్రస్తుతం ఏపీలో 40,047 యాక్టివ్ కేసులున్నాయని.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,25,099 మంది హాస్పిటల్స్   డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటివరకు ఏపీలో 68.46 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.

Latest Updates