24 గంటల్లో41,810 కేసులు..496 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 41 వేల 810 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 93 లక్షల 92వేల 920 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 496 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 36 వేల 696కు చేరింది. నిన్న మరో 42 వేల 298 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 88 లక్షల 2 వేల 267  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 53వేల 956యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 12,లక్షల 83వేల 449టెస్టులు చేశారు.

 

Latest Updates