తీహార్‌ జైలు నుంచి 419 మంది ఖైదీలు విడుదల

కరోనా వైరస్‌ కట్టడి చేసే క్రమంలో ఢిల్లీ జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడువేల మందిని రాజధానిలోని  తీహార్‌ జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా శిక్ష అనుభవిస్తున్న, రిమాండ్‌లో ఉన్న 419 మంది ఖైదీలను విడుదల చేసింది. వీరిలో 356 మందికి 45 రోజుల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మరో 63 మందికి 8వారాల అత్యవసర పెరోల్‌ మంజూరు చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 71 జైళ్ల నుంచి 11 వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయాలని నిర్ణయించింది.

Latest Updates