లిక్కర్‌‌ ఫ్యాక్టరీపై రైడ్‌ చేసిన 42 మంది పోలీసులు క్వారంటైన్‌లోకి

  • యజమానికి పాజిటివ్‌ రావడంతో

జార్ఖండ్‌: జార్ఖండ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 42మంది పోలీసులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వాళ్లంతా రైడ్‌ చేసిన ఇల్లీగల్‌ లిక్కర్‌‌ ఫ్యాక్టరీ ఓనర్‌‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోడేర్మా జిల్లాలో శనివారం రెండు పోలీస్‌స్టేషన్లకు చెందిన 45 మంది పోలీసులు ఇల్లీగల్‌ లిక్కర్‌‌ ఫ్యాక్టరీలో రైడ్‌ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని, అందుకే కాంటాక్ట్‌ అయిన దాదాపు 42 మందిని క్వారంటైన్‌లోకి పంపామని డిప్యూటీ కమిషనర్‌‌ ఆఫ్‌ పోలీస్‌ రమేశ్‌ గోపాల్‌ చెప్పారు. ఐదు రోజుల తర్వాత హైరిస్క్‌ పేషంట్ల శ్యాంపిల్స్‌ కలెక్ట్‌ చేసి టెస్టులు చేస్తామని, ఆ తర్వాత లో రిస్క్‌ వాళ్లను టెస్ట్‌ చేస్తామని అన్నారు. చటియారో జిల్లాలోని లిక్కర్‌‌ ఫ్యాక్టరీలో అక్రమంగా నిలువ చేశారనే సమాచారంతో 42 మంది పోలీసుల టీమ్‌ రైడ్‌ చేసింది. జైనగర్‌‌, చంద్వారా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఉన్నారు.

Latest Updates