40 మంది CRPF అమరులు

న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్ర మూకలు సృష్టించిన రక్తపాతం.. దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టేసింది. వీర జవాన్ల కుటుంబాలను శోక సంద్రంలో ముంచేసింది. పుల్వామాలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అంతటి బాధలోనూ ఒక బిడ్డ పోయినా మరో బిడ్డను భారత మాత సేవకు అంకితం చేస్తామంటూ వీర జవాన్ల కుటుంబాలు కన్నీటి ధారను తుడుచుకుంటూ ధైర్యంగా చెబుతున్నారు. ఆ వీరుల కన్నీళ్లు తుడుస్తామని, వారికి అండగా నిలుస్తామని ప్రధాని మోడీ ఇవాళ ఉదయం ప్రకటించారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని, సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని ఆయన చెప్పారు.

Latest Updates