నాగార్జునసాగర్ కు 42వేల క్యూసెక్కుల వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ఈ సీజన్ లో తొలిసారిగా నలబై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అయింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతోపాటు.. ఎగువన శ్రీశైలం డ్యాం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో నాగార్జున వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 559.90 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 42 వేల 378 క్యూసెక్కులు ఉండగా… దిగువన నారుమళ్లు.. వరినాట్లతోపాటు తాగునీటి అవసరాల కోసం 8వేల 373 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగరాజునసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుతం 232.1418 టీఎంసీలకు  చేరుకుంది.

Latest Updates