45 రోజుల్లోనే పఠాన్ చెరుకి గోదావరి నీళ్లు : హరీష్

45 రోజుల్లోనే పఠాన్ చెరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు అందిస్తామన్నారు… మంత్రి హరీష్ రావు. మంగళవారం (జూలై-24) పఠాన్ చెరులో పర్యటించిన ఆయన.. ఇస్నాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర 12 కోట్ల 63 లక్షలతో చేపట్టిన రోడ్డు విస్తరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ తరహాలోనే పఠాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృధ్ధి చేస్తామన్నారు. సంగారెడ్డి-కూకట్‌ పల్లి వరకు రూ. 50కోట్లతో రోడ్ల మరమ్మతులు, రూ. 15 కోట్లతో సారి చెరువు, రాయసముద్రం చెరువుల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి రాయితీలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. 3వేల కోట్లతో నారాయణఖేడ్ నుంచి నాందేడ్ వరకు… 4లైన్ల రోడ్డు విస్తరణ పనులను దశలవారీగా చేపడతామన్నారు మంత్రి హరీష్ రావు.

Posted in Uncategorized

Latest Updates