45 మంది NRI భర్తల పాస్‌పోర్టులు రద్దు

భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి  మేనకా గాంధీ. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది NRI ల పాస్‌పోర్టులను రద్దుచేసినట్లు తెలిపారు. కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్‌ శ్రీవాత్సవ నేతృత్వంలో సమీకృత నోడల్‌ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని చెప్పారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును తాము తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1967 నాటి పాస్‌పోర్ట్‌ చట్టం, 1973 నాటి క్రిమినల్‌ ప్రొసిజర్‌లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయన్నారు మేనకా గాంధీ.

 

Latest Updates