46 ఏళ్ల తర్వాత జేఎన్ యూలో స్నాతకోత్సవం

jntu1972లో తొలిసారి స్నాతకోత్సవం జరుపుకున్న ఢిల్లీ జేఎన్ యూ(జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ) 46 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండవ స్నాతకోత్సవం జరుపుకోంటుంది. ఆగస్టు-18న దీనిని నిర్వహించేందుకు యునివర్శిటీ అధికారులు నిర్ణయించారు. ప్రొఫెసర్‌ ఎస్‌.సి.గార్కోటీ నేతృత్వంలో ఈ స్నాతకోత్సవం కోసం స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 1969లో ప్రారంభమైన ఢిల్లీ జేఎన్ యూ…. వివిధ కారణాలతో 1972 తర్వాత ఇప్పటివరకూ స్నాతకోత్సవం జరుపుకోలేదు.

ఆగస్టు-18న జరగనున్న ఈ స్నాతకోత్సవంలో 2017 జనవరి నుంచి 2018 జూన్‌30 వరకు పీహెచ్‌ డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ ను విడుదల చేశారు యూనివర్శిటీ అధికారులు. విద్యార్థులు www.jnu.ac.in/convacation వెబ్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపారు. జులై 15లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates