దేశంలో రికార్డ్:24 గంటల్లో 97,570 కేసులు..1201మరణాలు

దేశంలో కరోనా కేసులు గత మూడు రోజులుగా 95 వేలకు పైగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 97,570 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  46,59,985కు చేరింది. నిన్న ఒక్కరోజే 1201 మంది మరణించడంతో మృతుల సంఖ్య 77,472కు చేరింది.36,24,197 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9,58,316 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రికవరీ కేసుల పర్సెంటేజ్, యాక్టివ్ కేసుల పర్సంటేజ్ ల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిందని..ఇది మంచి పరిణామం అని తెలిపింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ¾  వ వంతు మంది క్యూర్ అయ్యారని చెప్పింది. నమోదైన కేసుల్లో ¼ వ వంతే యాక్టివ్ కేసులున్నాయని చెప్పిది. రోజురోజుకు కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు చెప్పింది.

Latest Updates