48కి పెరిగిన బస్సు ప్రమాద మృతుల సంఖ్య…దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ

busఉత్తరాఖండ్‌ బస్సు ప్రమాద మృతుల సంఖ్య 48కు చేరుకుంది. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ ఆదేశించారు. మరోవైపు ఘటనాస్థలిని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించారు.ఈరోజు ఉదయం పౌరీ గల్వార్‌ జిల్లాలోని నైనిదండ దగ్గర రామ్‌ నగర్‌ నుంచి భోహన్‌ కు బయల్దేరిన బస్సు లోయలో పడిపోయింది. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది.

Posted in Uncategorized

Latest Updates