49 రోజులు సముద్రంలో ఒంటరిగా గడిపాడు

బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా 49రోజులపాటు సముద్రంలో గడిపాడు ఇండోనేషియాకు చెందిన అల్దీ నావెల్ అదిలాంగ్(19). పనామా నౌక సిబ్బంది సాయంతో సేఫ్ గా ఇంటికి చేరుకొన్నాడు.

ఇండోనేషియాలోని సులవేసికి చెందిన అల్దీ నావెల్ అదిలాంగ్.. చేపలు పట్టేందుకు ఉపయోగించే నీటిలో తేలే ఫిష్‌ ట్రాప్‌ లో పనిచేసేవాడు. ఓ తెప్పలాంటిదాని పై చిన్నగుడిసె ఉంటుంది. వీటిని రంపోంగ్ అని స్ధానికంగా పిలుస్తారు. సముద్రపు ఒడ్డుకు కొంచెం దూరంలో రంపోంగ్ లంగరు వేసి ఉంటది. చేపలను వలలో పడేసేందుకు….. సాయంత్ర సమయాల్లో రంపోంగ్ లోని దీపాలు వెలిగించే ఉద్యోగం చేసేవాడు అల్దీ నావెల్ అదిలాంగ్.  ఆ వెలుగు చూసి చేపలు వలల్లో చిక్కుకుంటాయి. అల్దీ నావెల్ అదిలాంగ్ రంపోంగ్ లోనే నివసిస్తాడు. వలలో పడిన చేపలను తీసుకెళ్లేందుకు వారానికి ఓసారి వచ్చే చేపల కంపెనీకి చెందినవారు అల్దీకి ఫుడ్, వాటర్, ఫ్యూయల్ సప్లయి చేస్తుంటారు.

అయితే ఈ ఏడాది జూలై లో వచ్చిన బలమైన ఈదురు గాలుల కారణంగా లంగరు తెగిపోవడంతో…. అల్దీ అలాఅలా తేలుతూ నడి సముద్రంలోకి వెళ్లిపోయాడు. అతని దగ్గర నాలుగు రోజులకు సరిపోయే సరుకులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆకలికి తట్టుకోలేక… తను ఉన్న రంపోంగ్ చెక్కను పీకీ దానితో చేపలను కాల్చుకొని తిన్నాడు. సముద్రపు నీరు చొక్కాలోంచి పిండుకొని తాగేవాడు.

సుముద్రంలో అటువైపు షిప్ లు వెళ్తున్నా ఎవరూ కూడా అల్దీని గుర్తించలేదు. ఆగస్ట్- 31న గ్వామ్ తీరంలో పనామా షిప్ ఆర్గెప్పియో సిబ్బంది అల్దీని చూసి కాపాడారు. సురక్షితంగా అల్దీని ఇంటికి చేర్చారు. అసలు తానుమళ్లీ తిరిగి నేలపై కాలు పెడతానని అనుకోలేదని…. చాలాసార్లు సముద్రంలో దూకి చనిపోదామనుకున్నానని…చివరకు పనామా షిప్ సిబ్బంది దయతో బతికానని అల్దీ తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates