ఒకే బైక్ పై 49 పెండింగ్ చలాన్లు

  • అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులకు  చిక్కిన టూవీలర్

అబిడ్స్, వెలుగు:  49 పెండింగ్ చలాన్లతో ఓ టూవీలర్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు వద్ద ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. బైక్ పై వస్తున్న  ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన అబ్దుల్ కరీం(47)ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది ఈ చలాన్ యాప్ ద్వారా అతని బైక్ ఉన్న ఫైన్లను చూశాడు. 49 పెండింగ్ చలాన్లతో రూ. 7,760 ఫైన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కరీం బైక్ ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. పెండింగ్ చలాన్లపై ఉన్న ఫైన్ ను కరీం చెల్లించడంతో  బైక్ ను తిరిగి అతడికి అప్పగించామని ట్రాఫిక్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

 

Latest Updates