భారత్ లో కరోనా కేసులు 492..మృతుల సంఖ్య 9

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492 కు చేరగా.. మృతుల సంఖ్య 9 కి చేరింది.

మహారాష్ట్రలో 101 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ఇక  కేరళలో 95 కేసులు నమోదు కాగా ఆ తర్వాత మహారాష్ట్రలో 87 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 37, తెలంగాణలో 33, ఉత్తర ప్రదేశ్ 33, రాజస్థాన్  33, ఢిల్లీలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక అత్యధికంగా ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 6077కు చేరింది తర్వాత చైనాలో  3277, స్పెయిన్లో 2311,అమెరికాలో 582 కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలుగు రాష్రాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతుంది.

Latest Updates