ఐటీబీపీలో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అధికారులు.  ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌ (ఐటీబీపీ), బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అసోం రైఫిల్స్, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్‌కమాండ్), స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్), మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో  మొత్తం 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.  పూర్తి వివరాలు తమ వెబ్ సైట్ లో పొందుపరిచారు అధికారులు.
పోస్టులు : సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(సెకండ్ ఇన్ కమాండ్ ) -4 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్ ) -175. మెడికల్ ఆఫీసర్ ( అసిస్టెంట్ కమాండెంట్ ) -317
మొత్తం ఖాళీలు : 496
విద్యార్హత : ఎంబీబీఎస్, డీఎం, ఎంసీహెచ్, పీజీ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు, ఎక్స్‌పీరియెన్స్, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక : విద్యార్హత మార్కులు, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలను అన్నింటి ప్రామాణికంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నెట్ బ్యాంకింగ్/ డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఈ చలనా ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 01..05.2019
ఫీజు చెల్లించడానికి చివరి తేది: 01.05.2019

Latest Updates