ఏపీలో 497 క‌రోనా కేసులు.. ఒక్క‌రోజే 10 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 497 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలో తాజాగా న‌మోదైన 497 కొత్త కేసుల‌తో క‌లిపి మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 10,331కి చేరింది. అందులో 4,779 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. క‌రోనాతో పోరాడుతూ 129 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో 5,423 మంది చికిత్స పొందుతున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో 448 మంది లోక‌ల్స్ కాగా, 37 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి, 12 మంది విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు ఉన్నారు. అలాగే క‌ర్నూలులో న‌లుగురు, గుంటూరులో ఇద్ద‌రు, శ్రీకాకుళంలో ఒక‌రు, కృష్ణా జిల్లాలో ముగ్గురు క‌లిపి మొత్తం 10 మంది క‌రోనాతో మ‌ర‌ణించార‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

జిల్లాల వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు:

Latest Updates