తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం

యాప్రాల్ లో అదృశ్యమైన 4వ తరగతి విద్యార్ధి ధీరజ్ రెడ్డి(9) ఆచూకీ లభ్యమైంది. నాలుగో తరగతి చదువుతున్న బాలుడు అదృశ్యమైన సంఘటన యాప్రాల్ లోని బాలాజీ నగర్ లో జరిగింది. ఇవాళ ఉదయం ఇంటిపక్కనే ఉన్న స్కూల్ కి వెళ్లిన ధీరజ్ రెడ్డి(9) కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా జొమాటో డెలివరీ బాయ్ సుబ్రమణ్యం వాయిపురి కాలనీలో ధీరజ్ రెడ్డిని గుర్తించాడు. అనంతరం ధీరజ్ ను అతడి కుటుంబసభ్యులకు అప్పగించాడు. బాలుడి ఆచూకీ కనిపెట్టినందుకు డెలివరీబాయ్ సుబ్రమణ్యానికి మల్కాజ్ గిరి డీసీపీ 5వేలు రివార్డ్ ప్రకటించారు.

Latest Updates