
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ‘ నాలుగో విడుత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 9 రాష్ర్టాల్లోని 71 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 5 గంటల వరకు 50.06 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 373 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 17, ఉత్తరప్రదేశ్లో 13, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 6, ఒడిశాలో 6, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూకశ్మీర్లో ఒక లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మే 6వ తేదీన జరిగే ఐదో విడుత పోలింగ్లో 51 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.