5జీ సేవలు ప్రారంభించండి.. చైనా కంపెనీకి కేంద్రం ఆహ్వానం

న్యూ ఢిల్లీ : మనదేశంలో 5జీ టెలికం సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించాలంటూ చైనా కంపెనీ హువావేను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. గత నెల 27న టెలికం శాఖ నుంచి తమకు ఆహ్వానం అందిందని కంపెనీ ప్రకటించింది. బదులుగా తాము పంపిన ప్రపోజల్ కు ఇంకా స్పందన రాలేదని తెలిపింది.

“ఏయే జోన్లలో ట్రయల్స్ చేయాలనే దానిపై డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) ఓ కమిటీని నియమించింది. వీటికోసం వంద మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను కేటాయించనుంది. ఢిల్లీతో పాటు.. మరో నగరంలో మేం ట్రయల్స్ నిర్వహించాలనుకుంటున్నాం” అని హువావే ఇండియా సీఈఓ జే చెన్ అన్నారు.

5జీ అప్లికేషన్ల తయారీకి డీఓటీ ిదివరకే ఎరిక్సన్, నోకియా, శామ్ సంగ్, సిస్కో, ఎన్ఈసీలకు అనుమతి ఇచ్చింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూచనతో.. కేంద్రం 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. హువావే కొంతకాలం కిందట.. ఎయిర్ టెల్ ల్యాబ్ లో 5జీ ట్రయల్స్ చేసింది. 3.5గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ లో చేసిన పరీక్షల్లో 3జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ సాధ్యపడింది. మనదేశంలో 2020లోగా 5జీ సేవలు కమర్షియల్ గా అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates