5జీ హోండా యాక్టివా వచ్చేసింది

2018-Honda-Activa-5G-Automatic-Scooter-1టూవీలర్ మార్కెట్లో తనకంటూ ప్రత్రేకమైన స్ధానాన్ని సంపాదించుకుంది హోండా యాక్టివా. తన సిరీస్ లో భాగంగా హోండా యాక్టివా ఐదో జనరేషన్ ను కంపెనీ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. కొత్త యాక్టివా 5జీని ఆటో ఎక్స్‌పో 2018లో హోండా మోటార్‌సైకిల్‌, స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఆవిష్కరించాయి. కొత్త డీలక్స్‌ వేరియంట్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, పొజిషన్‌ ల్యాంప్‌, కొత్త ఫ్రంట్‌ క్రోమ్‌ గార్నిష్‌తో ఈ ఐదవ జనరేషన్‌ యాక్టివాను మార్కెట్‌లోకి ఆవిష్కరించినట్టు హోండా కంపెనీ తెలిపింది. డజెల్‌ యెల్లో మెటాలిక్‌, పెర్ల్ స్పార్టన్ రెడ్ రంగుల్లో ఇవి అందుబాలులో ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఫ్రంట్‌ హుక్‌, సీట్‌ ఓపెనర్‌ స్విచ్‌తో 4-ఇన్‌-1 లాక్‌, కొత్త మఫ్లర్‌ ప్రొటెక్టర్‌లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. 109 సీసీ, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్, బీఎస్‌-4 ఇంజిన్‌ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. త్వరలోనే ఈ టూ వీలర్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది

Posted in Uncategorized

Latest Updates