5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి : కేసీఆర్

KCR Dతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సమన్వయ సమితిలో 5వేల ఎకరాకు ఒక వ్యవసాయ అధికారిని నియమించనున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. సోమవారం (ఫిబ్రవరి-26) కరీంనగర్ లో ఏర్పాటుచేసిన  రైతు సమితి సభలో మాట్లాడిన సీఎం.. రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

రైతు అంటే కేంద్రంలో ఒక నిర్లక్ష్య ధోరణి ఉండటంతోనే అన్నదాతలకు ఈ కష్టాలన్నారు. రైతాంగాన్ని అన్ని రకాలుగా అభివ్ద్ధి చేయడం బ్రహ్మపధార్థం ఏమీ కాదన్నారు. రైతాంగం బలమెంతో పార్లమెంటులో చూపించాలన్నారు. ఈ వర్షాకాలంలో నకిలీ విత్తనాలు అమ్మెవారిని తొలిదెబ్బ కొట్టాలన్నారు. అసంఘిటిత రంగంలో ఉన్న రైతాంగాన్ని సంఘటిత రంగంలోకి మారుస్తామన్నారు. వచ్చే వర్షాకాలం నుంచి మద్దతు ధరను తెలిపే టెక్నలజీ మిషన్లను అందుబాటులోకి తెస్తామని,  పంటలోని క్వాలిటి తేమశాతాన్ని తెలిపే ఈ పరికరాలు రైతు సమన్వయ కమిటీ ఆధ్వార్యంలు ఉండాలన్నారు.

దీంతో ప్రతి గింజకు మద్ధతు ధర ప్రణాళిక తేలికవుతుందన్నారు. తెలంగాణలో కరెంట్ పోయే ప్రశ్న రానివ్వమన్న కేసీఆర్.. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రంలో పలువురు అపోహలు కల్పించారన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నా.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ధర్నాలు చేయడం చూస్తూనే ఉన్నామని చెప్పారు. టీడీపీ కరెంట్ తేలేదు.. కాంగ్రెస్ కరెంట్ తేలేదు.. కరెంట్ తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు సీఎం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా.. గోదావరిలో వాటా తేలలేదు అని గుర్తు చేశారు. గోదావరి, కావేరి అనుసంధానం పేరిట కేంద్రం డ్రామాలు ఆడుతుందని సీఎం నిప్పులు చెరిగారు.

పాడి – పంట సంవృద్ధిగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అడ్డం పొడుగు తెలియనోళ్లంతా రైతు సమన్వయ సమితి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు సమన్వయ సమితికి స్థానిక సంస్థలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయానికి సరిపడా భూమి, కరెంట్ ఉంది.. నీళ్లు, ఎరువులు, విత్తనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో భారీ నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయించబోతున్నామన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates