5 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్

ఫేస్ బుక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. 5కోట్ల ఫేస్‌ బుక్‌ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని శుక్రవారం (సెప్టెంబర్-28)న వెల్లడించింది. వ్యూ యాజ్‌ ఫీచర్‌ తో హ్యాకర్లు చొరబడి.. సమాచారాన్ని సేకరించి ఉండవచ్చని తెలిపింది. ఈ డేటా దుర్వినియోగం జరిగిందో లేదో ఇంకా క్లారిటీ రాలేదని.. మిగిలిన వినియోగదారుల సేఫ్టీ వ్యవస్థను పటిష్టం చేశామని తెలిపింది.

కొంతకాలంగా ఫేస్‌ బుక్‌ పై తరచూ సైబర్‌ దాడులు జరుగుతున్నాయని.. ప్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు ఫేస్‌ బుక్‌ CEO మార్క్‌ జుక ర్‌ బర్గ్‌. ఈ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం (సెప్టెంబర్-28)న ఉదయం 9 కోట్లకు పైగా వినియోగదారులను ఎమర్జెన్సీగా తమ అకౌంట్లను లాగ్‌ ఔట్‌ చేయాలని సూచించింది ఫేస్‌ బుక్‌.  న్యూస్‌ ఫీడ్‌ పైన ఈ విషయాన్ని తెలియజేసింది.  హ్యాకర్ల దాడి వార్తల రావడంతో ఫేస్‌ బుక్ షేర్లు అమెరికా స్టాక్‌ మార్కెట్లలో నష్టపోయాయి. ప్రస్తుతానికి ఆ లోపాన్ని సరిదిద్దామని, ఈ విషయాన్ని అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియజేశామని తెలిపింది ఫేస్‌ బుక్‌.

Posted in Uncategorized

Latest Updates