అయోధ్యలో  ఆ 67 ఎకరాల నుంచే 5 ఎకరాలివ్వాలి : ఇఖ్బాల్‌ అన్సారీ

అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల్లోనుంచే 5 ఎకరాలివ్వాలని బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసులో లిటిగెంట్‌ ఇఖ్బాల్‌ అన్సారీ తో సహా పలువురు స్థానిక ముస్లిం నేతలు డిమాండ్‌ చేశారు. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్నికేంద్ర ప్రభుత్వం 1991లో స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పు చెబుతూ ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలను ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

దీంతో ఒకవేళ తమకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే.. తాము కోరిన దగ్గరే కేటాయించాలన్నారు ఇఖ్బాల్‌ అన్సారీ. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల్లోనుంచే తమకు 5 ఎకరాలు ఇస్తేనే తీసుకుంటామని లేకపోతే తాము ఈ ప్రతిపాదనను అంగీకరించబోమని స్పష్టం చేశారు. బయటకు వెళ్లండి… అక్కడే మసీదు నిర్మించుకోండి అనడం సరైంది కాదన్నారు అన్సారీ.

Latest Updates