అయోధ్య తీర్పు: ముస్లింలకు 5 ఎకరాల భూమి: సుప్రీం

అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామజన్మ భూమి న్యాస్‌కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించింది. భూమి ఎక్కడ కేటాయించాలనే విషయం కేంద్రం నిర్ణయించాలని సుప్రీం పేర్కొంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేయాలని  సీజేఐ అన్నారు. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలన్నారు. ఆ స్థలాన్ని సున్నీ బోర్డుకు అప్పగించాలన్నారు..

అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామజన్మ భూమి న్యాస్‌కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

Latest Updates