మ్యూజియాలుగా అయిదు పురావస్తు స్థలాలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2020లో అయిదు పురావస్తు స్థలాలను మ్యూజియాలను మారుస్తున్నట్లు ప్రకటించారు.

హర్యానాలోని రాఖీగఢీ, యూపీలోని హస్తినాపూర్, అస్సాంలోని శివ్ సాగర్, గుజరాత్‌లోని దోలావీరా, మరియు తమిళ్‌నాడులోని ఆదిచనెల్లూరులను మ్యూజియాలుగా మారుస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. 2020బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు.

Latest Updates