
హర్యానాలోని కురుక్షేత్రలో నల్వి గ్రామంలో గ్యాస్ లీక్ కావడంలో 100 మందికిపైగా ప్రజలు అస్వస్థతకు గురైయ్యారు. వారిలో సుమారు 50 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని షహదాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని కురుక్షేత్రలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు. షహదాబాద్-థాల్ రోడ్డులోని హర్‌గోబింద్ కోల్ట్ స్టోర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.