పాతది వదిలేస్తే కొత్త వెహికల్​పై 5%  డిస్కౌంట్

పాతది వదిలేస్తే కొత్త వెహికల్​పై 5%  డిస్కౌంట్
  • 20 ఏండ్లు దాటిన బండిని తుక్కుగా మార్చాల్సిందే
  • కమర్షియల్ వెహికల్ అయితే 15 ఏండ్లకే..
  • లేకపోతే వాహనాన్నిసీజ్ చేస్తాం
  • భారీగా పెనాల్టీలూ ఉంటయ్
  • వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ:పాత వెహికల్ను మూలనపడేద్దామనుకుంటున్న వారికి గుడ్న్యూస్. పాత వెహికల్ను తుక్కుగా మార్చడానికి ఓకే అంటే ఆటో కంపెనీలు కొత్త దానిపై ఐదుశాతం డిస్కౌంట్ ఇస్తాయి. బడ్జెట్లో ప్రకటించినట్టుగానే వెహికల్ స్క్రాప్ పాలసీ వివరాలను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ప్రకటించారు. దీని ప్రకారం పొల్యూషన్ విడుదల చేసే వెహికల్స్ను తప్పకుండా తుక్కుగా మార్చాలి. సాధారణ వెహికల్స్కు 20 ఏళ్లకు ఒకసారి, కమర్షియల్ వెహికల్స్కు 15 ఏళ్లకు ఒకసారి ఫిట్నెస్‌ టెస్ట్ పెడతారు. టెస్టులో పాస్ కాకపోతే వెహికల్ను స్క్రాప్గా మార్చుకొని డిస్కౌంట్ పొందవచ్చు. ఈ విషయమై గడ్కరీ మాట్లాడుతూ ‘‘పాత వెహికల్ వాడితే గ్రీన్ట్యాక్సీలు, ఇతర లెవీలు కట్టాల్సి ఉంటుంది. కచ్చితంగా పొల్యూషన్, ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాలి. ఇందుకోసం పీపీపీ విధానంలో ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు స్క్రాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి మేం సాయపడతాం. ఫిట్నెస్ టెస్ట్ ఫెయిలైతే భారీగా జరిమానాలు ఉంటాయి.  బండ్లను స్వాధీనం కూడా చేసుకుంటాం”అని స్పష్టం చేశారు.

ఆటో కంపెనీలకు వరం

వెహికల్స్క్రాపేజీ పాలసీ వల్ల ఆటో కంపెనీల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. వెహికల్స్కు డిమాండ్ పెరగడం వల్ల మరింత మందికి ఉపాధి దొరుకుతుందని గడ్కరీ అన్నారు. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటో సెక్టార్కు ఈ విధానం వల్ల ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటో సెక్టార్ ఏడాది టర్నోవర్ రూ.4.5 లక్షల కోట్లు ఉందని, రాబోయే ఏళ్లలో ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. ఎగుమతుల విలువ రూ.1.45 లక్షల కోట్ల నుంచి రూ.మూడు లక్షల కోట్లకు చేరుతుందని అన్నారు. ‘‘పాత వెహికల్ను తుక్కుగా మార్చాక దాని బాడీని, ప్లాస్టిక్ను, రబ్బర్ను, అల్యూమినియమ్ వంటి వాటిని కొత్త వెహికల్ తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వెహికల్ తయారీ ఖర్చు 40 శాతం వరకు తగ్గుతుంది. బండ్ల రేట్లు తగ్గుతాయి. వెహికల్ స్క్రాపేజీ విధానం వల్ల ఆటో సెక్టార్లోకి కొత్త టెక్నాలజీలు వస్తాయి. మైలేజీ మరింత పెరుగుతుంది. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్లవైపునకు మళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మన ఏటా చమురు కోసం రూ.18 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఫ్యూయల్ వెహికల్స్ పెరిగితే ఈ బిల్లును రూ.ఎనిమిది లక్షల కోట్ల మేరకు తగ్గించవచ్చు. వెహికల్స్ ఎక్కువగా అమ్ముడుపోవడమే కాదు, స్పేర్పార్ట్స్ కంపెనీలూ బాగుపడతాయి”అని మంత్రి వివరించారు. వీటిలో 20 ఏళ్లుపైబడిన 51 లక్షల లైట్ మోటార్ వెహికిల్స్ (ఎల్ఎంవీలు) ఉండగా, మిగతావి 15 ఏళ్లు పైబడిన 35 లక్షల ఎల్ఎంవీలు ఉంటాయి. ఫిట్నెస్ లేని మరో 17 లక్షల మీడియం, హెవీ మోటార్ వెహికిల్స్తుక్కుగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి.

ఆత్మ నిర్బర్ భారత్‌కు ఊతం

వెహికల్స్ స్క్రాప్ పాలసీ ఆత్మ నిర్బర్ భారత్ కు ఊతమిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఆటో సెక్టార్ లోకి రూ.10 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్లు వస్తాయని, 50 వేల మందికి జాబ్స్ దొరుకుతాయని అంచనా వేసింది. అయితే, పాలసీ రూపు, ఫ్రేమ్ వర్క్ ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ పై మాత్రం నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. కొత్త వాటితో పోలిస్తే పాత వెహికల్స్ 12 రెట్లు ఎక్కువగా కాలుష్యాన్ని వదులుతాయన్నారు. గ్రీన్ ట్యాక్స్ ద్వారా వసూలైన డబ్బును కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికే వాడతామని వివరించారు.