మీ వర్కౌట్స్‌‌లో ఈ 5 ఎక్సర్‌‌సైజ్‌లు ఉండాల్సిందే

ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఎక్స‌ర్‌‌సైజ్‌‌లు చేస్తుంటాం. మనలో చాలా మంది బరువు తగ్గడానికే కసరత్తులు చేస్తుంటారు. అయితే ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో మన శరీర భాగాల గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రత్యేకంగా యాబ్స్, లెగ్స్, ఫోర్‌ఆర్మ్స్ అని కాకుండా అన్ని పార్ట్స్‌‌ను శక్తిమంతం చేసే కసరత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో కేవలం ఎక్స‌‌ర్‌‌సైజ్‌లు చేస్తే ఫిట్‌‌గా ఉంటామని భావించకండి. కసరత్తులతోపాటు హెల్తీ లైఫ్‌‌స్టైల్, మంచి ఆహారపు అలవాట్లు ఉండటం తప్పనిసరి అని ఫిట్‌‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.

రెగ్యులర్‌గా ఎక్స‌‌ర్‌సైజ్‌‌లు చేస్తే బ్లడ్ ప్రెజర్ (బీపీ), డయాబెటిస్, ఆందోళన, ఒత్తిడి, ఆర్థరైటిస్, డిప్రెషన్ లాంటి సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాళ్లకు సంబంధించిన ఎక్స‌‌ర్‌‌సైజ్‌‌లు చేస్తే అధిక కొవ్వు తగ్గి, శరీరంలోని కింది భాగం చాలా దృఢవంతంగా తయారవుతుందని చెబుతున్నారు. నిపుణులు సూచిస్తున్న హోం లెగ్ వర్కవుట్లలో కొన్నింటి గురించి మాట్లాడుకుందాం.

స్క్వాట్స్: ఇవి తొలుత ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ రెగ్యులర్‌‌గా చేస్తుంటే సులువుగా మారుతుంది. స్క్వాట్స్ చేస్తే పిక్కలు, కండరాలు బలపడతాయి. స్క్వాట్స్ అంటే దాదాపుగా బింగీలు తీయడమే. నడుము భాగం వరకు వంగి తిరిగి నిల్చోవడమే. కాస్త అలవాటైతే పూర్తిగా వంగి తిరిగి లేవాలి.

వాల్ సిట్స్: వాల్ సిట్స్‌‌ను తెలుగులో గోడ కుర్చీ అంటారు. గోడకు నడుము, వీపు భాగం ఆన్చి వీలైనంత ఎక్కువ సేపు అదే పొజిషన్‌‌లో ఉండాలి. దీని వల్ల మన శరీర వెనుక భాగం స్టామినా ఎంతో తెలుస్తుంది. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల కాలి కండరాల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది.

లుంగే: ఈ ఎక్సర్‌సైజ్‌‌ను ఎక్కువగా క్రీడాకారులు చేస్తుంటారు. కాళ్లు బలంగా ఉండేలా చూసుకోవడానికి కబడ్డీ, ఫుట్‌బాల్ ప్లేయర్లు లుంగే తీస్తుంటారు. ఒక మోకాలి పొజిషన్ తీసుకొని, మరో కాలును కిందకు వంచడమే లుంగే కసరత్తు. ఈ కసరత్తు వల్ల తొడ కండరాలు, నడుముకు చాలా బలం చేకూరుతుంది.

వీటితోపాటు లెగ్ రైజెస్ (కాళ్లను పైకి, కిందికి లేపడం) కూడా బాగా ఉపయోగపడుతుంది. నేలపై పడుకొని రెండు కాళ్లను సమాన దిశలో ఒకేసారి పైకి లేపి, కాసేపు పొజిషన్‌‌ను ఆపి కిందకు దించాలి. ఇలా కొన్నిసార్లు చేస్తే శరీర కింది భాగం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే నిలబడి ఒక్కో కాలును మోకాలి ఎత్తు వరకు ఎత్తి, దించుతూ ఉండాలి. దీన్ని హై నీస్ విత్ టో ట్యాప్స్ అని అంటారు. ఈ కసరత్తులు చేయడానికి ఎలాంటి జిమ్ ఎక్విప్‌‌మెంట్ అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరి.

Latest Updates