తిరుమలలోని వకుళామాత పోటులో ప్రమాదం

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళామాత పోటులో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఐదుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. చింతపండు రసం తయారు చేస్తుండగా…బాయిలర్ లో ప్రెజర్ పెరిగి ఒక్కసారిగా పేలుడు సంబంవించింది. దీంతో వేడినీళ్లు పడి..సిబ్బంది గాయపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు అధికారులు. గాయపడిన ఐదుగురు సిబ్బందిని అశ్వనీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో సుమారు 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని తెలిపారు టీటీడీ అధికారులు.

Latest Updates