పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఐదుగురు మృతి

పాకిస్తాన్‌లోని చమన్ నగరంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ బాంబ్ బ్లాస్ట్ జ‌రిగింగి. న‌గ‌రంలోని హజ్ నిధా అనే మార్కెట్ సమీపంలో ఈ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల సమీపంలోని మెకానిక్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ బ్లాస్ట్‌ ఎవరు, ఎందుకు చేశారో అనేది ఇంకా తెలియ‌రాలేదు.

కాగా.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ పేలుడు ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో దాడులు పెరిగిపోయాయి. జూలై 21న టర్బాట్ బజార్‌లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

Latest Updates